CBN: వెనక్కి తగ్గిన చంద్రబాబు? లడ్డూ ప్రసాదం వివాదానికి ఇక స్వస్తి చెప్పినట్టేనా?
తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారా? ఈ వ్యవహారమంతా తమ మెడకు చుట్టుకుంటోందని ముఖ్యమంత్రి భావిస్తున్నారా? అందుకే దానికి ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముగింపు ఎట్లా పలకాలనేది ఆయనకు అంతు చిక్కడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తున్న తిరుమల ప్రసాదంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు, రోజులు గడిచే కొద్ది తన వైపు వేళ్లు చూపుతుండడం ఆయనకు ఇబ్బందిగా మారింది.
ఆ ట్వీట్‌కి అర్థమేంటి?
మరోవైపు వైసీపీ నేతలు సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుమలలో స్వామి వారి ఆలయం ఎదుట తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్య ప్రమాణం చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణాలు చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తాయి. అంతేకాదు, చంద్రబాబు తెలివిగా లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని దేవునికే వదిలేసి చేతులు దులుపుకోవడం విశేషం. మనమంతా ఉండి కూడా భగవంతునికి ఇలా అపరాధం జరిగిందని బాధగా ఉందని పేర్కొన్నారు. అందుకే అందరూ భగవంతునికి క్షమాపణ చెప్పాలని సూచించారు. ఇక భగవంతుడే చూసుకుంటాడని ఆయన పేర్కొన్నారు. భగవంతుడికే వదిలేయడం చూస్తే, ఇక ప్రభుత్వం పట్టించుకోదనే సంకేతాల్ని ఆయన ఇచ్చినట్టైంది.