తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CBN: చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీ మార్పు.. ఏ రోజంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కనీవినీ ఎరుగుని రీతిలో 164 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మొదట ఈ నెల 9న ముహూర్తం సైతం ఖరారు చేశారు. అయితే తాజాగా ప్రమాణస్వీకారం తేదీని మార్చారు. జూన్ 12వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

ALSO READ: జూన్ 8 మోదీ ప్రమాణస్వీకారం

జూన్ 12న మధ్యాహ్నం 12 గంటలకి అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ – 136 , జనసేన – 21, బీజేపీ – 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button