తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CBN: ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదా? కుప్పం ప్రజా తీర్పు ఎటువైపు?

ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ కంచుకోట, చంద్రబాబు సొంత నియోజక వర్గంలో ఈసారి బాబుకు ఓటమి తప్పదా? అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లోకుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 73 శాతం పోలింగ్ నమోదు అయితే.. ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగని ఎన్నో పనులు.. ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు జరగటంతో కుప్పం ప్రజల మైండ్ సెట్ లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు.

ALSO READ: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ సిద్దం!

కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా కాలువ ద్వారా క్రిష్ణా జలలాలు తీసుకొచ్చిన తర్వాతే ఓటు అడగటానికి వస్తానని చెప్పిన సీఎం జగన్.. చేతల్లోనూ అదే తీరును చూపటంతో ఈసారి మార్పు మీద పెద్ద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఈసారి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటేయటంతో కొత్త చర్చ మొదలైంది. ఈ వాదన ఇలా ఉంటే.. చంద్రబాబుకు అనుకులంగా మరో వాదన ప్రచారంలో ఉంది. ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అవుతాయని.. కాబట్టి.. ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తోడు.. చంద్రబాబు జైలుకు వెళ్లటం కూడా కొంత మేర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. బాబు ఓడిపోతారన్న ప్రచారంతో ఒకలాంటి మైండ్ గేమ్ ఆడారని.. ఆ ట్రాప్ లో కుప్పం ప్రజలు పడరన్న ధీమాను తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కాలికి బలపం కట్టుకొన్న రీతిలో ఈసారి ఎన్నికల వేళ ప్రత్యేక శ్రద్ధ పెట్టటంతో పాటు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button