తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Chandrababu: ‘ఐఎంజీ భారత’కి భూముల కేటాయింపులో చంద్రబాబుకు షాక్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు.. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2003లో ఆయన ప్రభుత్వ హయాంలో ‘ఐఎంజీ భారత’కు కేటాయించిన భూములు సర్కారువే అని తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి పరిశీద్దాం.

ALSO READ: పొత్తు కోసం బీజేపీతో చంద్రబాబు కాళ్ల బేరం… ఆ పార్టీ జతకడుతుందా?

ఫేక్ కంపెనీకి 850 ఎకరాలు..

ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేశారు. దాని అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు. అద్భుతమైన క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేశారు. కంపెనీ ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది. ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా.. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ తీర్మానం కూడా లేకుండానే చంద్రబాబు కేవలం జీఓ ద్వారా ఓ అనామక కంపెనీకి 850 ఎకరాలు అప్పగించడం పట్ల దుమారం రేగింది.

ALSO READ: మహిళా సాధికారతకు నిర్వచనం.. సీఎం జగన్

వేల కోట్ల భూములు మళ్లీ ప్రభుత్వ ఖాతాలోకి..

అయితే, 2004లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. ఐఎంజీ భారత కంపెనీకి కేటాయించిన భూముల్లో భారీ అవినీతి జరిగిందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఎలాంటి అనుభవం లేని, ఫేక్ సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల విలువైన భూములు తిరిగి ప్రభుత్వ ఖాతాలో పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button