తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: జగన్

సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు అంతరాయం కలిగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారా? ఇందులో భాగంగా ఏకంగా సీఎంపైనే భౌతిక దాడులకు సైతం వెనుకాడటం లేదా? ఈ దాడి వెనుక ఉన్నది విపక్షాలేనా? అన్న ప్రశ్నలకు వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం వస్తోంది. అవును.. జగన్‌పై జరిగిన దాడి ముమ్మాటికి విపక్షాల పనేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక, ఓటమి భయంతోనే ఈ దాడికి పాల్పడ్డట్లు ఆరోపిస్తున్నాయి.

 ALSO READ: సీఎం జగన్ 15వ రోజు బస్సుయాత్ర ప్రారంభం

అధైర్యపడొద్దంటూ పార్టీ శ్రేణులకు జగన్ ధైర్యం

ఇంతటి దాడి జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ బస్సుయాత్ర ప్రారంభానికి ముందు వైసీపీ నేతలతో ఆయన సమావేశమై, దాడిపై స్పందించారు. ‘ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారు. కానీ మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేద్ధాం. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ’ అని పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో ధైర్యం నింపారు.

ALSO READ: జగన్ మీద దాడి.. దిగజారిన యెల్లో మీడియా!

నిందితులను పట్టిస్తే రూ. 2 లక్షలు

మరోవైపు, సీఎం జగన్‌పై దాడి చేసిన వారిని పట్టించిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. జగన్‌పై దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. దాడికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button