తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM YS Jagan: రోజుకు మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం.. నేటి షెడ్యూల్ ఇదే!

సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించి.. రాష్ట్రాన్ని చుట్టేశారు. ఇందులో భాగంగా రోడ్‌షోలు, బహిరంగ సభల్లోనూ ప్రసంగించారు. తాజాగా, ప్రచార గడువుకు తక్కువ సమయం ఉండడంతో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌.. రోజుకు మూడు జిల్లాల చొప్పున విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

ALSO READ: వాలంటీర్ వ్యవస్థను రూపుమాపేందుకు చంద్రబాబు మరో కుట్ర!

మూడు సభల్లో ప్రసంగం..

సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌‌లో ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్‌ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button