Cyclone Fengal: ఫెయింజల్ ఎఫెక్ట్.. విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు
ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు గజ గజ వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. మరోవైపు తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు చెన్నైలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో విశాఖ-చెన్నై విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు విమనాశ్రయ అధికారులు తెలిపారు.
విమానానికి తప్పిన ప్రమాదం
కాగా, చెన్నై విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.