తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Dana Cyclone: ‘దానా’ తుఫాను ఎఫెక్ట్‌.. 200 రైలు సర్వీసులు రద్దు, దారి మళ్లింపు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను తీరం వైపు దూసుకువస్తోంది. ఈ తుఫాను ప్రభావం ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలపై భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు హై అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ సైతం అప్రమత్తమైంది. పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దు, దారి మళ్లించిన వాటిలో సుమారు 200 సర్వీసులు ఉన్నాయి. ఈ వివరాలను ప్రయాణికులకు తెలియజేసేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ్ రైల్వేస్టేషన్లలో హెల్ప్‌ లైన్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 08912746330, 08912744619, 8712641255, 7780787054 నంబర్లకు కాల్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు!

మరోవైపు ‘దానా’ తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా బలపడనుంది. బుధవారం ఉదయానికి ఒడిశాలోని పరదీప్‌కు 560 కి.మీ, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపానికి 630కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపురకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో శనివారం వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button