తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Elections: ఏపీ రాజకీయాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ… ఈక్వెషన్స్ మారనున్నాయా?

దక్షిణాదిన కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం కొంత పెరిగినట్టయింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. వేగవంతమైన నిర్ణయాలు, కార్యాచరణతో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున సభలు, సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలివే..!

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడు ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది.

Also Read: ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని పర్యటన.. పదేళ్లలోనే చాలా చేశామని వెల్లడి

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా.. ఆయనతో ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 15న విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button