తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

EX CM YS Jagan: మాజీ సీఎం జగన్‌పై మాస్‌ ట్రోలింగ్‌..అబ్దుల్ కలామ్ గురించి మాట్లాడే అర్హత లేదు!

ఏపీ మాజీ సీఎం జగన్‌.. జూలై 27న అబ్ధుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ‘దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం.. దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అంటూ యువ‌త‌లో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయ‌న‌. ఒక మారుమూల గ్రామంలో జ‌న్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం.’ అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్‌పై సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్‌పై మాస్‌ ట్రోలింగ్‌ జరుగుతోంది. అబ్దుల్‌ కలామ్‌ వర్ధంతి సందర్భంగా జగన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలామ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తునన్నారు. పచ్చి బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. అబ్దుల్ కలామ్ పేరునే కనిపించకుండా చేసిన వాడివి.. ఇవాళ నీ రాజకీయానికి వాడుకుంటున్నావా అంటూ మండిపడుతున్నారు. గత 5ఏళ్లు ఆయనను అవమానించినందుకు, ముందు క్షమాపణ చెప్పి, అప్పుడు మాట్లాడలన్నారు.

ALSO READ: ఏపీలో అరాచక పాలన సాగుతోంది.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా.. వైజాగ్‌లో ఉన్న వ్యూ పాయింట్‌కు గతంలో అబ్దుల్‌ కలాం పేరు ఉండేది. అయితే జగన్‌ హయాంలో అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. అలాగే ఏపీజే అబ్దుల్ కలామ్ పురస్కారాన్ని కూడా వైఎస్సార్ విద్యా పురస్కారంగా మార్చారు. కలామ్‌ పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సహాలకు కూడా జగనన్న ఆణిముత్యాలుగా మార్చారు. ఇలా అబ్దుల్‌ కలామ్ పేర్లు మార్చి ఇప్పుడు ఆయన గురించి ట్వీట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button