తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP&TS: ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేయడమే లక్ష్యమా? రేవంత్, చంద్రబాబుల ప్లాన్ ఇదేనా?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల గురు-శిష్యుల బంధం ఎవరికీ తెలియనిది కాదు. ఒకరకంగా రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది చంద్రబాబు నాయుడే. రాష్ట్రం విడిపోయాక తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు గానీ ఆయన యాస, ధ్యాస టీడీపీనే అని ఇప్పటికీ కొందరు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే ఉంటారు. అయితే ఈ విషయం కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈ గురు-శిష్యులు ఇద్దరూ కలిసి భారీ వ్యూహానికి తెర లేపారని, అందులో భాగంగానే ఒక్కొక్క పావును కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలి ఇద్దరు సీఎంల భేటీ అధికారికంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసమని చెబుతున్నా.. లోపల మాత్రం వేరే రహస్య ఎజెండా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ALSO READ: కొత్త రేషన్ కార్డులకు సర్కార్ కసరత్తు.. పాత కార్డుల్లో మార్పులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో 2028లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఇప్పటినుంచే భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీతో టీడీపీ పొత్తు కోసం వ్యూహాలు రచిస్తున్నారాయన. ఎలాగూ ఎన్టీయేలో టీడీపీదే పైచేయిగా ఉంది కాబట్టి బీజేపీ అధిష్టానం పెద్దల్ని బ్లాక్‌మెయిల్ చేసో, లేదా బుజ్జగించో తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుకు ఒప్పించడం ఆయన వ్యూహం. అయితే దీనివల్ల చంద్రబాబుకు ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా? ప్రయోజనం ఆయనకు కాదు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డికి. తెలంగాణలో టీడీపీని నమ్మేందుకు ఇక్కడి ప్రజలెవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇక బీజేపీని సైతం తెలంగాణ ప్రజలు ఛీదరించుకోవడం ఖాయం. మరోవైపు తెలంగాణలో తన ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీని నామరూపల్లేకుండా రేవంత్ రెడ్డి ఇప్పటికే చేయాల్సినదంతా చేస్తున్నారు. ఆ పార్టీ నేతల్ని ఒక్కొక్కర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న బీజేపీని దెబ్బకొట్టేందుకు గురు-శిష్యులిద్దరూ కలిసి రచిస్తున్న భారీ వ్యూహమిది అన్నమాట. మరి ఈ వ్యూహాన్ని బీజేపీ పెద్దలు, తెలంగాణ ప్రజలు ఎలా అర్థంచేసుకుంటారో. ఇక ఏపీలోనూ వైసీపీని ఇంకా కోలుకోనివ్వకుండా ఆ పార్టీ నేతల మీద కేసులు పెట్టించేందుకు చంద్రబాబు ఇప్పటికే వ్యూహాలు పన్నుతున్నారు. దీన్ని బట్టి చూస్తే గురువేమో ఏపీలో, ఆయన శిష్యుడేమో తెలంగాణలో శాశ్వతంగా పాగా వేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button