తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Kolusu Parthasarathy: జగన్..దమ్ముంటే అసెంబ్లీకి రావాలి: మంత్రి పార్థసారథి

జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఏపీ మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ పార్థసారథి సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందిస్తామంటూ మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు రాయడం తగదంటూ ఆయన హితవు పలికారు.

గత వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయంటూ మంత్రి గుర్తుచేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ మోహన్ రెడ్డిదంటూ పార్థసారథి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ అభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button