తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్

Manchu Manoj: ‘మంచు’ ఫ్యామిలీ వార్‌లో మరో మలుపు.. జనసేనలోకి మనోజ్ దంపతులు!

‘మంచు’ ఫ్యామిలీ వార్ అటు తిరిగి.. ఇటు తిరిగి మరో కొత్త టర్న్ తీసుకుంది. మంచు మనోజ్ కుమార్, ఆయన భార్య భూమా మౌనికలు జనసేన పార్టీలో చేరనున్నట్లు వినిపిస్తోంది. ఇవాళ ఆళ్లగడ్డలో మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మనోజ్ దంపతులు 1000 కార్లతో ఆళ్లగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. భూమా ఘాట్‌లో రాజకీయ ఆరంగేట్రంపై మనోజ్ దంపతులు ప్రకటించే అవకాశం ఉంది. తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మంచు మనోజ్, మౌనిక నిర్ణయంపై సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక, మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయి.

ఆళ్లగడ్డ, నంద్యాలలో పట్టు

కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభ మృతిచెందిన తర్వాత.. భూమా అఖిలప్రియ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్క బాటలో నడవాలని చెల్లి భూమా మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని భర్త మంచు మనోజ్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మనోజ్ సంగతి ఎలా ఉన్నా.. మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయి. 2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు రాయలసీమలో చిరంజీవికి నాగిరెడ్డి అండగా నిలబడ్డారు. అదే విశ్వాసం పవన్ కళ్యాణ్ సైతం తమ కుటుంబంపై చూపుతారని మౌనిక భావిస్తున్నారు. దీంతో టీడీపీ కంటే జనసేనలో చేరితే బాగుంటుందని మనోజ్, మౌనిక భావించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button