తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Memantha Siddham Bus Yatra: కదం తొక్కిన మహిళా లోకం.. మళ్లీ జగనన్నే రావాలని నినాదాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 7వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. అంతకుముందు బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండలోనూ భారీగా జనాలు తరలివచ్చారు. దారిపొడవునా సీఎంకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఈ యాత్ర సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్‌ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్‌కు చేరుకోనుంది.

ALSO READ: పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో.. రియల్ లైఫ్‌లో కాదు!

షెడ్యూల్‌లో లేకున్నా..

బస్సు యాత్ర చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకుంది. ఇక్కడ అక్కచెల్లెమ్మలు పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అదే విధంగా సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం పలికారు. కాగా, అంతకుముందు షెడ్యూల్‌లో లేకున్నా.. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు అక్కడి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లారు. మండుటెండల్లోనూ మహిళా లోకం కదం తొక్కింది. కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అదే విధంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ వైసీపీలో చేరారు.

ALSO READ: జిత్తుల మారి పొత్తుల ముఠా తయారైంది..నేరుగా దెబ్బ కొట్టలేకనే!

పూతలపట్టులో బహిరంగ సభ..

సీఎం జగన్‌కు చేపట్టిన బస్సు యాత్రలో అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికారు. సాయంత్రం పూతలపట్టు బైపాస్‌ వద్ద బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. ఇక్కడి నుంచి పి.కొత్తకోట, పాకాల క్రాస్‌, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్‌, చంద్రగిరి క్రాస్‌ రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనుంది. రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్‌ బస చేయనున్నారు. కాగా, ఈ బస్సు యాత్రలో కొంతమంది పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిరగలేమని తమ గోడు వెళ్లబుచ్చారు. సీఎం మహిళతో మాట్లాడుతుండగా.. ‘జగనన్నకీ జై, మళ్లీ నువ్వే రావాలి, జగనన్నే మాకు కావాలి, మేము మిమ్మల్ని గెలిపిస్తాము’ అని ఓ వృద్ధురాలు సీఎంపై ఆమెకున్న ప్రేమను కనబరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button