ఆంధ్రప్రదేశ్
New Liquor Policy: నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం!
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ భేటీలో నూతన మద్యం విధానానికి ఆమోదం లభించింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అంతేకాదు, సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
మళ్లీ ప్రైవేట్‌కే అప్పగింత!
రాష్ట్రంలో మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నారు. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టనున్నారు. మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్‌కే అప్పగించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 3, 396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.