తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: పవన్ సెటైర్లకు స్పందించిన హరిరామ జోగయ్య.. ఏమన్నారంటే..!

పవన్ కళ్యాణ్‌కు కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్క మాత్రం లేదు. ఆ తిక్కతోనే రాజకీయంగా ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ జనసేన పార్టీకి తనకు తానే నష్టం కలిగించుకుంటున్నారని సొంత పార్టీ నేతలే పలు సందర్భాల్లో చర్చించుకుంటున్నారు. తన తల తిక్క మాటలతో రాజకీయంగా తనకు సలహాలు, సూచనలు ఇస్తున్న వారిని పవన్ దూరం చేసుకుంటున్నారని విశ్లేషకులు సైతం మాట్లాకుంటున్నారు. నిన్న తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్యపై పవన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ: సంచలన సర్వే.. మళ్లీ వైసీపీదే అధికారం!

నాకు సలహాలొద్దు.. ఏం చేయాలో తెలుసు: పవన్

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిన్న టీడీపీ-జనసేన కూటమి నిర్వహించిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి హరిరామ జోగయ్యపై పరోక్ష విమర్శలు చేశారు. తనకు తరచూ లేఖలు రాస్తున్న హరిరామ జోగయ్యపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నాకు మీరు సలహాలు ఇవ్వొద్దు. నాకు ఏమి చేయాలో బాగా తెలుసు. మీరు మాతో యుద్ధానికి వస్తే కలసి చేద్దాం, అంతే తప్ప సలహాలూ, సూచనలు అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేయకండి’ అని హెచ్చరించారు. ఆయన పేరు పెట్టి పవన్ ఈ హెచ్చరికలు చేయకపోయినా ఈ వ్యాఖ్యలు హరిరామ జోగయ్యను ఉద్దేశించి చేసినవేనని అందరికీ అర్థమైంది.

ఇక మీ కర్మ: హరిరామ జోగయ్య

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హరిరామ జోగయ్య తాజాగా స్పందించారు. ‘తెలుగుదేశం, జనసేనల బాగు కోరి నేనిచ్చే సలహాలు అధినేతలిద్దరికీ నచ్చట్లేదు. అది వారి కర్మ. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు. కాగా.. సీట్ల పంపకంలో జనసేనకు టీడీపీ అన్యాయం చేస్తోందని, ఈ విషయంలో వైఖరి సరికాదని పలు సందర్భాల్లో పవన్ కు హరిరామ జోగయ్య లేఖలు రాసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button