తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: ఏ హీరోతోనూ నేను పోటీ పడను.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ఓజీ.. ఓజీ.. అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆయన సినిమాలపై స్పందించారు. ముందు బాధ్యతలు, ఆ తర్వాతే సినిమాలన్నారు.

ఏ హీరోతనూ ఇబ్బంది లేదు..!

ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలని పేర్కొన్నారు. అందుకే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవాలని, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం రాష్ట్రంలో డబ్బు ఉండాలని.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలని అన్నారు. ఇక, టాలీవుడ్‌లో తనకు ఏ హీరోతోనూ ఇబ్బంది లేదని పవన్‌ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఎవరితోనూ తాను పోటీ పడనని పేర్కొన్నారు. హీరోల్లో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిష్ణాతులుగా ఉన్నారని చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని ఇలా అందరు హీరోలు బాగుండాలని కోరుకున్నారు. ఇలా మీ అభిమాన హీరోలకు మీరు జై కొట్టాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని ప్రజలకు తెలిపారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button