తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరులా ఉంటాయ్.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల విషయంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘క్రిమినల్‌కు కులం, మతం ఉండదు. రేప్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయడానికి కులం అడ్డొస్తుందా? అధికారులు ఏం చేస్తున్నారు.. క్రిమినల్స్‌ను వదిలేయమని చట్టం చెప్తోందా?’ అని ప్రశ్నించారు. పోలీసులు, కలెక్టర్లు పదే పదే చెప్పించుకోవద్దని పవన్ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ కీలకమైనది. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. మేము ఎవరినీ వెనకేసుకు రావడం లేదు.. మీరు కూడా వెనకేసుకు రావద్దన్నారు.

అలసత్వం వహిస్తే నేనే హోం మంత్రి!

హోం మంత్రి అనితపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై హోం మంత్రి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తాను హోం మంత్రి బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే వాడిని నేను. మాది ప్రతీకార ప్రభుత్వం కాదు.. అలాగని చేతగాని ప్రభుత్వం కాదు. అధికారులు అలసత్వం వహిస్తే తానే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కూటమి పార్టీల్లోని నేతల తీరుపైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిని ఎవరు చెడగొట్టలేరని, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే తమను ఏమీ చేయలేరన్నారు. తాను, చంద్రబాబు క్లారిటీతో ఉన్నామన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button