Pawan Kalyan: సోషల్ మీడియా అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా వణికిపోతున్నారు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అంటేనే గజగజ వణికిపోతున్నారా? తనకు వ్యతిరేకంగా వస్తున్న ట్రోల్స్‌ని చూసి తట్టుకోలేకపోతున్నారా? అందుకే తనపై ట్రోల్ చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు దేనికైనా సిద్ధపడుతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుందని, ఎవరి మీద ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, ఎవరికి ఏ హామీ ఇచ్చినా ఫర్వాలేదనుకున్నారు పవన్ కళ్యాణ్. మైక్ దొరికితే చాలు పనిలో పనిగా ఏవేవే వాగ్ధానాలు కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అవే ఆయనకు మెడకు చుట్టుకున్నాయి.
అప్పుడు అలా..!
పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు.. వైసీపీ ప్రభుత్వం హయాంలో 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులోకి కేంద్ర నిఘా వర్గాల్ని కూడా లాగారు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసుని 100 రోజుల్లో తేల్చేస్తానని శపథం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు, ఓపీఎస్ తీసుకురావడంపై పవన్ హామీ ఇచ్చారు. అలాగే కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే ఆడపిల్లల రక్షణ బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగులకు రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా నోటికొచ్చినా హామీలన్నీ ఇచ్చేశారు.
ఇప్పుడు ఎందుకిలా..?
దీంతో జగన్‌ను కాదని పవన్‌పై నమ్మకం ఉంచి చంద్రబాబు కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారు. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్సయింది. తానిచ్చిన హామీల్ని నిలబెట్టుకోడానికి పవన్ ఎలాంటి చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన్ను నిలదీసే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గతంలో ఆయన ఇచ్చిన హామీలను, మాట్లాడిన మాటల్ని, వాగ్దానాలను వీడియోలతో సహా ట్రోల్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఏం మాట్లాడారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడుతున్నారు? అంటూ ప్రశ్నస్తున్నారు. ఈ పరిణామాలే పవన్ కళ్యాణ్‌లో తీవ్ర అసహనాన్ని నింపుతున్నాయి. అందుకే ఆయన సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయనను ప్రశ్నించినవారిని ఎక్కడకక్కడ అరెస్ట్ చేయాలని హుకూం కూడా జారీ చేశారట. అందులో భాగంగానే ఇటీవల కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ కూడా చేశారు.