తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan vs Prakash Raj: పవన్ కళ్యాణ్‌ను వదలని ప్రకాశ్ రాజ్.. చేయని తప్పుకు సారీ ఏంటీ..?

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ విషయంలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరూ రెచ్చిపోతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుమల లడ్డూ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాశ్ రాజ్‌ను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. తానే చెప్పినదేమిటి.. పవన్ అర్థం చేసుకున్నదేమిటని, తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నానని.. 30వ తేదీ తర్వాత వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమధానాలు చెపుతానని ఎక్స్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఇదేం ఆనందం?

ఇక, హీరో కార్తీ తాజా చిత్రం ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో ‘లడ్డూ’పై జరిగిన చర్చ వైరల్ అయింది. దీనిపై పవన్ స్పందిస్తూ.. లడ్డూ మీద ఒక సినిమా ఫంక్షన్‌లో జోకులేశారని మండిపడ్డారు. అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. దీంతో, పవన్‌కు కార్తీ క్షమాపణ చెప్పారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా తాను ఎప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్..’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button