తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు షాక్.. కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు!

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఆయనపై ఏపీలో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సోషల్ మీడియాపై ఉక్కుపాదం

గతంలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదే పదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్‌గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదే పదే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్ ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button