తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Ration Cards: ఏపీలో నేటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ఎట్టకేలకు ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంబంధిత అధికారులు స్వీకరించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసమే కాకుండా, పాత రేషన్ కార్డుల్లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు.

1.50 లక్షల కొత్త కార్డులు

ఇక, ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. ఈ సారి కొత్తగా కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరికాకుండా లబ్ధిదారులకు అందించే కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్ర వేయించి పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button