తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

RGV: ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ సహా చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును కొట్టివేయాలని ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణకు సమయం కోరిన ఆర్జీవీ

ఆర్జీవీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్‌ వేసుకోవాలని ఆదేశించింది. ఈక్రమంలో పోలీసుల విచారణకు మరికొంత సమయమివ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అభ్యర్థన పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని చెప్పింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button