తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Richest CM: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఆస్తులు ఎన్ని రూ. కోట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అతి సంపన్న సీఎంగా నిలిచారు. ఏడీఆర్ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) ఈ మేరకు సీఎంల ఆస్తుల వివరాలను వెల్లడించింది. చంద్రబాబుకు మొత్తం ఆస్తులు రూ. 931 కోట్లున్నాయని.. అప్పు రూ.10 కోట్లు ఉందని తెలిపింది. రిచ్చెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబే ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.. ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉంటే.. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఏకంగా రూ.895 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అఫిడవిట్‌లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఉన్న షేర్లనూ కలిపి లెక్కించారు.

చివరి స్థానంలో మమతా

ఇక, ఈ జాబితాలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ నిలిచారు.. ఆయన పేరుతో రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలిచారు. ఆయన ఆస్తులు రూ.51.93 కోట్లు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆస్తులు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయి. ఆయనకు రూ. కోటి అప్పు ఉంది. ఈ జాబితాలో ఆయన ఏడో స్థానంలో నిలిచారు. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్‌ పేరిట రూ.1.18 కోట్లు.. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేరిట రూ.55 లక్షల ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో దేశంలో తక్కువ ఆస్తి రూ.15 లక్షలతో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button