తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్
Trending

Social Media War: టీడీపీ ఎక్స్‌ట్రాలు చేస్తే వైసీపీతో పొత్తు పెట్టుకుంటాం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కూటమిలో చిచ్చు మొదలైంది. గేమ్ మొదలుపెట్టింది లోకేశా మరి.. చంద్రబాబా తెలీదు కానీ.. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న స్వరం రోజురోజుకి పెరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మొదలుపెట్టిన ఈ నినాదాన్ని ఒక్కొక్కరుగా పార్టీలోని అందరూ అందుకుంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ లాంటి వారైతే బహిరంగంగానే లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలకు సోషల్ మీడియా వేదికగా జనసైనికులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ ‘చిచ్చు’ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

సోషల్ మీడియాలో ‘వార్’

సోషల్ మీడియాలో టీడీపీ తమ్ముళ్లు వర్సెస్ జనసేన సైనిక్స్ మధ్య గట్టి వార్ నడుస్తోంది. నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేసి పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు సీఎం అయినా, లోకేశ్ మంత్రి అయినా అది కేవలం పవన్ వల్లేనని ఎప్పటికీ మర్చిపోవద్దని కౌంటర్లు ఇస్తున్నారు. ఇలాగే టీడీపీ ఎక్స్‌ట్రాలు చేస్తే వైసీపీతో పొత్తు పెట్టుకుంటామంటూ కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అంతేకాదు, ఒకవేళ లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుకు వయసైపోయింది.. పైగా ఎలాగూ ఎన్డీయేలోనే ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రినో లేదా ఉపరాష్ట్ర పదవినో తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button