తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

TDP: పవన్ కళ్యాణ్‌కు చెక్..? లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేసేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్..?

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును ‘తెలుగు తమ్ముళ్లు’ కొందరు జీర్ణించు కోలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఉంటూనే స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరు, దూకుడుగా ముందుకెళ్తున్న పవన్ నైజం, జనసేన పార్టీకి పెరుగుతున్న మైలేజ్ వారికి మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీడీపీ మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, వ్యూహాత్మంగానే ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యాన్ని తగ్గించి నారా లోకేశ్‌ను నంబర్ 2 స్థానంలో కూర్చోబెట్టాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.

ఎవరి మనసులోని మాట?

చంద్రబాబు ముందే లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆ పార్టీ ముఖ్య నేత శ్రీనివాస్ రెడ్డి మాటలు స్వర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో మూడో తరం నాయకుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అన్నారు. ఆయనకు ఆ సమర్థత కూడా ఉందని అన్నారు. అయితే, ఈ మాటలు అన్నది టీడీపీలోని ఏ అడపా దడపా నాయకుడో అంటే ఏమో కానీ.. ఏకంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడే అనడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పవన్ మైలేజీకి బ్రేక్ వేసే ప్లాన్?

ఇది కేవలం ఆయన మనసులోని మాట కాదని, అధినేతల వారి ఆదేశం మేరకు శ్రీనివాస్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. నారా లోకేశ్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నది చంద్రబాబు ‘జీవిత ఆశయం’. కానీ దానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నారు. పైగా కూటమి ప్రభుత్వంలో లోకేశ్‌ మాటా ఏదీ చెల్లుబాటు కావడం లేదు. క్రెడిట్ అంతా పవన్‌కే వెళ్లిపోతోంది. ఇలాగే ఉంటే టీడీపీకి భవిష్యత్తులో జనసేననే నుంచే ప్రమాదం పొంచి ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే పవన్‌కి చెక్ పెట్టి.. ఉపముఖ్యమంత్రి పదవిలో లోకేశ్‌ను కూర్చోబెట్టడం లేదా పవన్ ఉండగానే రెండో ఉపముఖ్యమంత్రిగా లోకేశ్‌ను కూర్చోబెట్టి కూటమిలో పవన్ ప్రాధాన్యాన్ని తగ్గించాలని టీడీపీ భారీ స్కెచ్ వేసినట్లు వినిపిస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button