TDP-Janasena: కూటమిలో మొదలైన లుకలుకలు.. పవన్ కళ్యాణ్‌పై టీడీపీ సీరియస్?
హోం మంత్రి అనితపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, దానికి అనితే కారణమని, ఆమె చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ టీడీపీ పెద్దలకు ఏమాత్రం రుచించడం లేదట. పవన్ వ్యాఖ్యలతో ప్రతిపక్షానికి రాజకీయంగా ఆయుధం ఇచ్చినట్టైందని పవన్ కళ్యాణ్‌పై ‘తమ్ముళ్లు’ గుర్రుగా ఉన్నారట. అందుకే రానున్న రోజుల్లో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ అనుబంధ మీడియా ఒక కన్నేసి ఉంచనున్నట్లు వినిపిస్తోంది.
పవన్‌ది ఓవరాక్షన్?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊరుకుంటే ఓవరాక్షన్ చేస్తున్నారని, ఆయనకు పరిపాలన అంటే ఏంటో రుచి చూపాలని ఆలోచనతో టీడీపీ పెద్దలున్నారట. అందుకే జనసేన మంత్రులు గొప్పగా చేస్తున్న పనులేవీ లేవని త్వరలో తమ అనుబంధ మీడియాను ఆసరా చేసుకొని నిరూపించనున్నారట. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలందరిపై నిఘా పెట్టనున్నట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, ఇంతకాలం ఎందుకులే అనుకున్నామని, ఇకపై ఉపేక్షిస్తే అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నారనే ఆలోచనలో టీడీపీ ఉందట.