తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: కూటమి ప్రభుత్వం ఐదేళ్లు నడవదు..! సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక, శ్రీవారి లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదంపై, కూటమి ప్రభుత్వంపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ స్వార్థంతోనే లడ్డూ వివాదం!

‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాదు. శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న తప్పు. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు కూడా నడవదు’ అని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button