తెలుగు
te తెలుగు en English
Linkin Bioఆంధ్రప్రదేశ్

Tirumala: రేపు తిరుమలకు జగన్.. చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు పక్కా ప్లాన్!

తిరుమల లడ్డూ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇక, ఈ వివాదంపై వైసీపీ కూడా స్పీడ్ పెంచేసింది. అధికార పార్టీ నాయ‌కుల‌పై ఎదురు దాడికి దిగింది. ఈ క్ర‌మంలోనే ఈ శనివారం (సెప్టెంబర్‌ 28) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని త‌మ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చింది వైసీపీ. అంతేకాదు, రేపు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నట్లు ప్రకటించారు. కాలి న‌డ‌క‌న ఆయ‌న తిరుమ‌ల చేరుకోనున్నారు. 28న శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోనున్నారు. తిరుమ‌ల ప్ర‌సాదంపై వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకోనుంది.

డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా?

అయితే, అన్యమతస్థులు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేయాలని.. కాబట్టి జగన్ సంత‌కం చేసిన త‌ర్వాతే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే డిమాండ్ కూట‌మి నేత‌ల నుంచి వ‌స్తోంది. ఇదే ఇప్పుడు ఉద్రిక్త‌త‌కు దారి తీస్తోంది. మరోవైపు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ నేత‌లు పిలుపునిచ్చారు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తిరుమ‌ల శ్రీ‌వారిని త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను ద‌ర్శించుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వైసీపీ నేత‌లు తేల్చి చెబుతున్నారు. దీంతో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేపుతోంది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి వైసీపీ నేత‌లు అన్ని ర‌కాలుగా సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా అడ్డంకులు సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తే, దీటుగా తిప్పికొట్ట‌డానికి వైసీపీ నేత‌లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో రేపు తిరుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తుండటంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button