Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. ప్రక్షాళనే పెను ప్రమాదమైందా?
తిరుపతి తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించడం, 44 మంది భక్తులు గాయాల పాలవడం అందర్నీ కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో టీటీడీ పాలక మండలి, పోలీసుల నిర్లక్యష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. టిక్కెట్ల జారీలో నిర్ధిష్ట ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు, క్యూలైన్లలో ఉన్న భక్తుల్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమైనట్లు నివేదికలు వచ్చాయి.
ఇదేనా ప్రక్షాళన..?
మరోవైపు, ఈ ప్రమాదానికి టీటీడీ పాలక మండలి చేపట్టిన సంస్కరణలు కూడా మరో కారణంగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులకు అవకాశం కల్పించింది. అయితే పది రోజుల కోసం ఒకేసారి టోకెన్లను జారీ చేసేది. దీంతో తాము కోరుకున్న తేదీలో కాకపోయినా, ఆ పది రోజుల్లో ఏదో ఒక సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రక్షాళన పేరుతో ఒక్కోసారి కేవలం రెండు లేదా మూడు రోజులకు మాత్రమే దర్శనానికి టోకెన్లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారి దర్శనం టోకెన్లు దక్కకపోతే, మళ్లీ మళ్లీ క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని ఒక్కసారిగా భక్తులు పోటెత్తడం, పైగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.