ఆంధ్రప్రదేశ్
Transfers: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీలు!
ఏపీలో బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు శాఖలో ఇప్పటికే పలు దఫాలుగా బదిలీల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం తాజాగా మరోసారి భారీగా డీఎస్పీల బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయ్యింది వీళ్లే!
బదిలీ అయిన అధికారుల్లో జి. సీతారామా రావు, వీవీ అప్పా రావు, ఎన్. కాళిదాస్, చిట్టిబాబు, బి.రామకృష్ణ, సురేశ్ కుమార్ రెడ్డి, ఏబీజీ తిలక్, రవి కిరణ్, మల్లిఖార్జున రావు, శ్రీనివాస రెడ్డి, ఎండీ.మొయిన్, కే సీహెచ్ రామా రావు, విజయశేఖర్, కొంపల్లి వెంకటేశ్వర రావు, కే. రసూల్ సాహెబ్, సీహెచ్ వి రామా రావు, షన్ను షేక్, ఎన్. సురేశ్ బాబు, వాసుదేవన్, డి.లక్ష్మణరావు ఉన్నారు.