తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Vijayasai Redy: జగన్‌కు చెప్పిన తర్వాతే రాజీనామా.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు!

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలు వీడుతున్నానని స్పష్టంచేశారు. తన లాంటి వాళ్లు వెయ్యి మంది రాజీనామాలు చేసినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నష్టమేమీ లేదని అన్నారు.

నా లాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా జగన్ ఆదరణ తగ్గదు!

‘సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. వైఎస్‌ కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధముంది. వైఎస్‌ రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్‌.. ఇలా మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారితో విభేదాలు లేవు.. భవిష్యత్తులోనూ రావు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాను. వైసీపీకి 2019లో 151 స్థానాలు సాధించింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్‌ వచ్చింది. జగన్‌ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. నా లాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదనేది నా ఉద్దేశం. రాజీనామా నిర్ణయాన్ని లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌కు ఫోన్‌లో వివరించాను. ఆ తర్వాతే రాజీనామా చేశాను’ అని అన్నారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button