తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం: ఏపీఈఆర్సీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అనేక పథకాలను ప్రవేశ పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే విషయం తెలిపింది.

ALSO READ: చంద్రబాబు పొలిటికల్‌ మాస్టర్‌ ప్లాన్‌..గందరగోళంలో పవన్‌‌!

విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రతి ఏటా మార్చిలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏపీలో ఎలాంటి అదనపు భారం లేకుండా టారిఫ్‌ను రూపొందించిట్లు ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్‌ టారిఫ్‌ను విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర జలవనరుల నిర్వహణ, రైతుశిక్షణ కేంద్రంలో విడుదల చేశారు.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం

చట్టప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఇంధన ధరలకు, వాస్తవ ధరలకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమల్లో ఉన్న ఛార్జీలే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button