తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే: మళ్లీ వైసీపీదే అధికారం!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా వెలువడుతున్న పలు రాజకీయ సర్వేలు అధికార వైసీపీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటే, కూటమిలోనేమో తీవ్ర నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల వెలువడిన ఏ సర్వే చూసినా ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో మరోసారి వైసీపీనే అధికారంలోకి రానున్నట్లు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సర్వే సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఆ వివరాలు చూద్దాం..

ALSO READ:  సీఎం జగన్‌పై దాడికి కారకులెవరు?

వైసీపీకి 130, కూటమికి 45 సీట్లు మాత్రమే!

పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 120 – 130 సీట్లు వస్తాయని, మరోసారి అధికారం చేజిక్కించుకుటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కేవలం 45 – 55 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. అలాగే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గానూ వైసీపీ 19 – 21 స్థానాల్లో గెలుపొందుతుందని, కూటమిలోని మూడు పార్టీలకు కలిపి కేవలం 4 – 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టంచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ సర్వేను చేపట్టినట్లు తెలిపింది.

ASLO READ: వైసీపీలోకి క్యూ కట్టిన టీడీపీ కూటమి నేతలు..!

వైసీపీకి 52 శాతం ఓట్లు, కూటమికి 46 శాతం మాత్రమే!

ఇక, ఓట్ల శాతం విషయానికి వస్తే.. వైఎస్‌ఆర్‌సీపీకి 50 – 52 శాతం ఓట్లు వస్తాయని వస్తాయని, కూటమి పార్టీలకు 44 – 46 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. వైసీపీకి పురుషల ఓట్లు 48 శాతం వస్తాయని, మహిళా ఓట్లు 55 శాతం వస్తాయని స్పష్టంచేసింది. ఇక కూటమికి పురుషల ఓట్లు 47 శాతం వస్తాయని, మహిళా ఓట్లు 40 శాతం వస్తాయని అంచనా వేసింది. మార్చి 16 – ఏప్రిల్ 10 వరకు ఈ సర్వేను చేపట్టినట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button