తెలుగు
te తెలుగు en English
జాతీయం

Assembly Elections: మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి హవా!

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి హవా కొనసాగుతోంది. మరోవైపు జార్ఖండ్ లో జేఎంఎం సత్తా చాటుతోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (145)ను ఎప్పుడో దాటేసింది. అక్కడ ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. అటు ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (41)ను దాటింది.

ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన మహాయుతి, జేఎంఎం

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 217 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ సొంతంగానే 126 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. శివసేన శిండే వర్గం 56, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అటు ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 51 స్థానాల్లో ముందంజలో ఉంది. 100కు పైగా స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఘోరంగా చతికిలపడి కేవలం 19 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇదే కాంగ్రెస్ పెద్ద దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, శివ సేన ఉద్ధవ్ వర్గం 18, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. ఇక, ఝార్ఖండ్‌లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ కూటమి ప్రస్తుతం 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని కూటమి 29 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా.. మ్యాజిక్‌ ఫిగర్ 41.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button