జాతీయం
Bihar: బిహార్‌లో తప్పిన మరో రైలు ప్రమాదం
బిహార్‌లో మరో రైలు ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే డెమూ ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయి. ఈ క్రమంలో.. ఫరింగోరా సమీపంలో రైలును వెంటనే ఆపేశారు. అయితే.. ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా.. ఈ అగ్నిప్రమాదం గురించి సమీపంలోని ప్రజలు రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.