తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bill Gates: ప్రధాని మోదీని కలిసిన బిల్ గేట్స్… పలు అంశాలపై చర్చ!

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మోదీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు. అనేక అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళల నాయకత్వంలో అభివృద్ధి, వ్యవసాయరంగంలో సృజనాత్మక మార్పులు, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, భారత్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన అంశాలతో పాటు పలు ఇతర విషయాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయని చెప్పారు.

Also Read: చిన్నారుల క్యూట్ ఆహ్వానం… కేటీఆర్ స్పందన ఇదే!

కాగా, సమావేశం అనంతరం మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గేట్స్‌‌తో మీటింగ్ అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానించారు. పుడమి పరిరక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. అంతకుమునుపు, గేట్స్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా సమావేశమయ్యారు.

Also Read: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

అంతకు ముందు ఒడిశాలోని ఓ మురికివాడను మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శించారు. బిల్ గేట్స్ ఒడిశా ప్రభుత్వ అధికారులతో కలిసి భువనేశ్వర్ లోని మామంగ్ల బస్తీలో పర్యటించారు. బిజూ ఆదర్శ కాలనీ వాసులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే స్వయం సహాయక సంఘాల మహిళలతో సంభాషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button