తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bomb threats: దేశంలో ఆగని ‘విమాన’ బెదిరింపులు.. 14 రోజుల్లో 350 ఘటనలు!

దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలకం రేపుతున్నాయి. బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇవాళ కూడా 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో గడిచిన 14 రోజుల్లో మొత్తంగా 350కిపైగా విమానాలు ఈ తరహా బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇవాళ ఒక్కరోజే 50 విమానాలకు

తమ సంస్థకు చెందిన 15 విమానాలకు ఆదివారం బెదిరింపులు వచ్చినట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. వాటికి క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత సర్వీసులు కొనసాగాయని పేర్కొంది. వీటితోపాటు ఇండిగోకు చెందిన 18 విమానాలకు, 17 విస్తారా విమానాలకు ఇటువంటి మెసేజ్‌లు వచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తంగా ఆదివారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. అయితే వీటి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button