తెలుగు
te తెలుగు en English
జాతీయం

BSP: ఏ పార్టీతో పొత్తు లేదు.. ఒంటరిగానే బరిలోకి దిగుతాం: మాయావతి

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ).. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఖండించారు. పొత్తు అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో తన సొంత బలంతో దేశంలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడుతుందని అన్నారు. ఎన్నికల కూటమి లేదా మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు.

ALSO READ: ఏపీ రాజకీయాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ… ఈక్వెషన్స్ మారనున్నాయా?

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మాయావతి ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రత్యర్థి అయిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి చెబుతున్నా.. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఆమె మాట మార్చవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. కాగా.. లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button