తెలుగు
te తెలుగు en English
జాతీయం

Cabinet Meeting: చివరి కేబినెట్ భేటీ.. కేంద్రం సంచలన నిర్ణయాలు!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డేయే ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా నిన్న జరిగిన చివరి కేబినెట్ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏను పెంచిన ప్రభుత్వం.. పేదలు, మధ్యతరగతి వారు లబ్ధిపొందుతున్న ఉజ్వల పథకం సబ్సిడీని మరో ఏడాది పొడగించింది. అంతేకాదు, ముడి జనపనార కనీస మద్దతు ధరను భారీగా పెంచింది. ఈ మేరకు నిన్న సమావేశమైన మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది.

ALSO READ: మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 ఉంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సిలిండర్ ధర రూ.300 తగ్గి రూ.655కే లభించనుంది. ముడి జనపనార కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,335‌గా నిర్ణయించింది. గత సీజన్‌తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.285 పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, సామాన్యులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button