తెలుగు
te తెలుగు en English
జాతీయం

Central Budget: ఏపీకి నిరాశ మిగిల్చిన 2024-25 కేంద్ర బడ్జెట్!

2024 – 25 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఎన్డీయే ప్రభుత్వంలో అత్యధిక ఎంపీ స్థానాలతో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో అంతా తానై చక్రం తిప్పుతారని అందరూ భావించారు. కానీ రాష్ట్రానికి కనీస నిధులు రాబట్టడంలో, ప్రత్యేక హోదా అంశంలోనూ చంద్రబాబు ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇక వైజాగ్ మెట్రో గురించి అయితే బడ్జెట్లో ఊసే లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా కేంద్రం చేత చంద్రబాబు చేయించలేకపోయారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పగానే కొంత పొంగిపోయినా.. కానీ అవి వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేయగానే అందరూ షాక్ తిన్నారు.

ఇక కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీద కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చినా.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే అంటూ కేంద్రం కొత్త రాగం అందుకుంది. అయితే టీడీపీ తర్వాత ఎన్డీయేలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న బిహార్ లోని జేడీయూ మాత్రం ఆ రాష్ట్రానికి భారీగా నిధులు సాధించుకుంది. ఏకంగా ఆ రాష్ట్రానికి 26 వేల కోట్లు కేటాయించారు. ఆ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, కొత్త విమానాశ్రయాలు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, రైల్వే జోన్ కి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్‌లో బీజేపీ మద్దతు లేకుండా జేడీయూ పాలన సాగించలేదు. కానీ ఏపీలో అయితే బీజేపీ మద్దతు లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లను చంద్రబాబు దక్కించుకున్నారు. అయినా బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యే చూపారు. దీన్ని బట్టి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వ వివక్ష మరోసారి నిరూపితమైంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button