జాతీయం
Delhi: ఢిల్లీ సీఎం రేసులో అతిశీ!
నిర్దోషిగా నిరూపించుకునే వరకు తాను సీఎంలో కొనసాగనని, మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యల తర్వాత ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తర్వాతి సీఎం ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అతిషి పేరు ముందంజలో ఉంది. అతిషి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ బాధ్యతలు ఆమెపై ఉన్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి అనుభవజ్ఞులైన నాయకులు జైలులో ఉన్నప్పుడు, అతిషి ప్రతి రంగంలోనూ పార్టీ స్వరం పెంచారు. ఆమె కూడా ప్రతి వేదికపై కేజ్రీవాల్ భార్యకు అండగా నిలిచారు.