Delhi Elections: వేడెక్కిన హస్తిన రాజకీయాలు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగరా!
రాజధాని రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ రాజీవ్ కుమార్. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నా పోటీ మాత్రం ప్రధానంగా అధికార ఆప్, బీజేపీల మధ్యే కొనసాగనుంది.
ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ తేది: జనవరి 10
నామినేషన్లకు చివరి తేది: జనవరి 17
నామినేషన్ల పరిశీలన: జనవరి18
నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 20
పోలింగ్ తేది: ఫిబ్రవరి 5
ఫలితాలు: ఫిబ్రవరి 8