తెలుగు
te తెలుగు en English
జాతీయం

HMPV Virus: భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్.. బెంగళూరులో రెండు కేసులు నమోదు!

అందరూ భయపడ్డట్టే జరిగింది.. చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్‌లోకీ ప్రవేశించింది. బెంగళూరుకు చెందిన మూడు నెలల పాపతో పాటు మరో ఎనిమిది నెలల బాబుకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది. ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో నిర్వహించిన వైద్య పరీక్షలో వైరస్ పాజిటివ్‌గా తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు చైనా, జపాన్ లకే పరిమితమైన ఈ కొత్త వైరస్ బెంగళూరు చిన్నారులకు సోకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వారికి ఈ వైరస్ ఎలా సోకిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.

సాధారణ ఫ్లూ లక్షణాలే..

ఇక, ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ తరహాలో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా పదకొండు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులలోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో ఇటీవల ఈ వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. కొవిడ్ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. ఆసుపత్రుల ముందు ఈ వైరస్ సోకినవారు బారులు తీరుతున్నారు. పలు చోట్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ జపాన్‌కూ వ్యాపించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button