తెలుగు
te తెలుగు en English
జాతీయం

Indian Railways: దేశవ్యాప్తంగా రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలు.. స్పందించిన కేంద్రం!

రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగుచూశాయని రైల్వేశాఖ ఇటీవల తెలిపింది. కొందరు దుండగులు పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి, రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు వీటిల్లో ఉన్నాయంది.

ఇప్పటి వరకు 24 ఘటనలు

గత ఏడాది జూన్ నుంచి ఈ తరహాలో 24 ఘటనలు జరిగాయని భారత రైల్వే నివేదిక వెల్లడించింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌, తర్వాత పంజాబ్‌, ఝార్ఖండ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడ్డాయి. వీటివల్ల ఆగస్టులో కాన్పూర్‌ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ట్రాక్‌పై ఉంచిన ఓ వస్తువు కారణంగా తేలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం మరోసారి కాన్పూర్‌, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోను ఈ ఘటనలు వెలుగుచూశాయి. కాగా.. ఈ పట్టాలు తప్పించే కుట్రలు ఎంతో కాలం సాగవని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఇప్పటికే వీటిపై దర్యాప్తును తీవ్రం చేశామని పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button