తెలుగు
te తెలుగు en English
జాతీయం

Lok Sabha election: మార్చి 13న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్?

సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. మార్చి 13న షెడ్యూల్‌ను వెల్లడించవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 2019, మార్చి 10న వెల్లడైన నేపథ్యంలో ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

ALSO READ: నేడు సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

దేశంలోని సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఏర్పాట్లను సమీక్షిస్తోన్న విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించి ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు జమ్ము కశ్మీర్‌‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఈసారి కూడా ఏడు దశల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button