తెలుగు
te తెలుగు en English
జాతీయం

Mahayuthi: వీడని చిక్కుముడి.. ‘మహా’ సీఎం ఎవరు?

మహారాష్ట్ర సీఎం పదవిపై చిక్కుముడి వీడటం లేదు. మరో మూడు రోజుల్లో అక్కడ నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే అంశంపై మహాయుతి కూటమి ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. మహా సీఎంని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. సీఎం ఎంపికలో వీరిద్దరి పాత్రం కీలకం కానుంది.

బీజేపీకే సీఎం పదవి?

డిసెంబర్ 3న జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి వీరద్దరూ హాజరుకానున్నారు. కాగా.. ముంబైలో జరిగే బీజేపీ సమావేశానికి ఆపార్టీ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌ తాజాగా ఢిల్లీకి పయనమయ్యారు. ఇక, కేబినెట్‌ పదవులు ఖరారు చేసేందుకు మహాయుతి నేతల సమావేశానికి ఏక్‌నాథ్‌ షిండే హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి సీఎం పదవి మాత్రం బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button