తెలుగు
te తెలుగు en English
జాతీయం

Monkeypox: భారత్‌లోకి ఎంటరైన మంకీ‌పాక్స్‌.. మొదటి కేసు నమోదు!

ప్రపంచ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి కూడా ఎంటరైపోయింది. ఇన్నిరోజులు ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో మాత్రమే అలజడి రేపిన ఈ వైరస్.. మనదేశంలోనూ ఇప్పుడు అలజడులు సృష్టిస్తోంది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది.

Also Read: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు

విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకుముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు పేర్కొంది.. ఈ కేసు మునుపటి 30 కేసుల మాదిరిగానే ఇది కూడా ఒకటని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button