తెలుగు
te తెలుగు en English
జాతీయం

One Nation – One Election: మరో అడుగు ముందుకు.. ‘జమిలి’ బిల్లును ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ ఆమోదం!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జమిలి’ ఎన్నికల బిల్లుపై మరో కీలక ముందడుగు పడింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తొలుత ఈ బిల్లును సభ ముందు ఉంచగా.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు ఎన్డీయే మిత్ర పక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్‌ నిర్వహించారు. హైబ్రిడ్‌ విధానంలో ఓటింగ్ చేపట్టగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఆ తర్వాత ‘జమిలి బిల్లుల’ను కేంద్రమంత్రి సభలో ప్రవేశపెట్టారు.

బిల్లును ఉపసంహరించుకోవాలి!

మరోవైపు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీతో పాటు మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదేళ్లు ఉంటుంది. అదే జమిలి ఎన్నికలు దేశంలో నిర్వహిస్తే.. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తి కాకుండానే కొన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి. అయినా ‘జమిలి’ ఎన్నికలతో కేవలం జాతీయ పార్టీలే ప్రయోజనం పొందుతాయన్న వాదనలు కూడా ఉన్నాయి.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button