తెలుగు
te తెలుగు en English
జాతీయం

PM Kisan: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో నగదు జమ

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ పథకం కింద 16వ విడత నిధుల్ని ఇవాళ రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ. 2,000 చొప్పున జమ చేయనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6,000లను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 15 విడతలుగా అందజేయగా.. ఇవాళ 16వ విడల నిధులు అందజేయనుంది. చివరగా గతేడాది నవంబర్ 23న లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేసింది. 15వ విడతతో 9,01,73,669 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. మరో రెండు గ్యారెంటీలు అమలు

పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే, ఈ-కేవైసీ చేసి ఉండాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్​ఫర్) పద్ధతిలో పెట్టుబడి సాయం జమ అవుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే pmkisan-ict@gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. లేదా 155261, 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లలో కూడా సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button